4477) బెత్లెహేము పురములోన రక్షకుడు ఓయమ్మో


** TELUGU LYRICS **

బెత్లెహేము పురములోన రక్షకుడు ఓయమ్మో 
కన్నియ గర్భాన జనియించినాడమ్మ 
బెత్లెహాము పురము లోన రక్షకుడు ఓరన్న 
కన్నియ్య గర్భాన జనియించినాడన్న
లోకాన్ని ప్రేమించి పాపాన్ని క్షమియించి - మోక్షాన్ని మనకివ్వ ధరకేగినాడమ్మో 
లోకాన్ని ప్రేమించి పాపాన్ని క్షమియించి - మోక్షాన్ని మనకివ్వ ధరకేగినాడన్న 
రండి మనం అందరం పండుగ చేద్దాం
రారాజు పుట్టాడని ఎలుగెత్తి చెప్పుదాం (2) 
||బెత్లెహేము||

శుభవార్త చెప్పేందుకు ఒక దూత వచ్చెను 
ఆ గొర్రెల కాపరులకు ఆనవాళ్ళు చెప్పెను (2)
శిశువును దర్శించి,ఆనందం వికసించి
మెస్సయ్య జనన వార్తను చాటించి నారమ్మో (2)
రండి మనం అందరం పండుగ చేద్దాం
రారాజు పుట్టాడని ఎలుగెత్తి చెప్పుదాం (2) 
||బెత్లెహేము||

క్రీస్తు యేసు పుట్టిననాడు ఒక తార వెలిసెను 
ఆ తార జ్ఞానులకు త్రోవను చూపించెను (2)
బంగారం సాంబ్రాణి బోళముని అర్పించి 
మహారాజు పుట్టాడని పూజించి నారమ్మో  (2)
రండి మనం అందరం పండుగ చేద్దాం
రారాజు పుట్టాడని ఎలుగెత్తి చెప్పుదాం (2)
||బెత్లెహేము||

----------------------------------------------------------------------------------------------------
CREDITS : Music : Peterson Mallipudi
Vocals : Vineeth Rayi,Sandeep Teja Varasala ,Rajesh Kondepudi,
Vinay Prasad Kalukuracha,Vikas Prajhna Kalukuracha,Sahaja Rayi,
Sharmila Kondeti,Kavya Bondada,Shivani Anala 
----------------------------------------------------------------------------------------------------