** TELUGU LYRICS **
ఉదయించె యేసు జన్మించె క్రీస్తు
చీకటి కమ్మిన బ్రతుకులో నిరాశతో కృంగిన జీవితం
చీకటి కమ్మిన బ్రతుకులో నిరాశతో కృంగిన జీవితం
ఆశలు చిగురించెను వెలుగులు ప్రసరించెను
తూర్పున జ్ఞానులను దర్శించెను నీ తార అనంత జ్ఞాని నా యేసు రాజా
మా జ్ఞాన మార్గపు మరణంచులలో - నీ దర్శన జ్ఞానము దయచేసావు
సంగీత సంబరాల సంకీర్తనతో స్తుతియింతు స్తోత్రింతు నీ మేలులకై
గొర్రెల కాపరులను దర్శించెను ప్రేమతో
ప్రధాన కాపరిగా నిలచుండె యేసు
గమ్యము ఎరుగని నా యాత్రను - సుగమ్యము చేయుట నీ ఆశయ్యా
గాన ప్రతిగాన గీతాలతో - ఘనపరతును యేసయ్య నీ నామము
ప్రధాన కాపరిగా నిలచుండె యేసు
గమ్యము ఎరుగని నా యాత్రను - సుగమ్యము చేయుట నీ ఆశయ్యా
గాన ప్రతిగాన గీతాలతో - ఘనపరతును యేసయ్య నీ నామము
బెత్లహేము పురములో జన్మించెను యేసు భూతలమునకే అరుదెంచెను క్రీస్తు
భారమనక నా పాప బరువును - భరించిన నా యేసయ్యా
నీ ప్రేమ బంధాలు బంధించెను - నా శేష బ్రతుకును అర్పింతును
భారమనక నా పాప బరువును - భరించిన నా యేసయ్యా
నీ ప్రేమ బంధాలు బంధించెను - నా శేష బ్రతుకును అర్పింతును
----------------------------------------------------------------------------
CREDITS : Vocals : George Bush Garu
Lyrics & Music : Sudhakar Garu & Peterson Garu
----------------------------------------------------------------------------