** TELUGU LYRICS **
దేవుడు మనిషిగా పుట్టిన రోజండి క్రిస్మస్ అంటే
చీకటిలో వెలుగులు నింపింది క్రిస్మస్ అంటే
ఒక ఊరు ఒక ప్రాంతం కాదు
ఒక రాష్ట్రం ఒక దేశం కాదు
ప్రభువు పుట్టిన పర్వదినము
ఇది ప్రపంచానికే పండుగదినము
దేవుడు మనిషిగా
Happy Christmas
దేవుడు మనిషిగా
Happy Christmas
||దేవుడు మనిషిగా||
చీకటిలో వెలుగులు నింపింది క్రిస్మస్ అంటే
ఒక ఊరు ఒక ప్రాంతం కాదు
ఒక రాష్ట్రం ఒక దేశం కాదు
ప్రభువు పుట్టిన పర్వదినము
ఇది ప్రపంచానికే పండుగదినము
దేవుడు మనిషిగా
Happy Christmas
దేవుడు మనిషిగా
Happy Christmas
||దేవుడు మనిషిగా||
పరలోక పురమందు
హోయ్ హోయ్
పరిశుద్ధుడు నీవంటూ
హోయ్ హోయ్
కోట్లాది దూతలు పాడే స్తుతిగీతాలతో
రాజులకే రాజంటు
హోయ్ హోయ్
ప్రభువులకే ప్రభువంటూ
హోయ్ హోయ్
నిత్యం నింగిలో వినిపించే స్తుతికీర్తనలతో
మహిమను పొందిన మహారాజు
మహిమాన్వితుడైన యేసురాజు
ధివిని విడిచి భువికొచ్చిన రోజు
మానవాళికిది పండుగరోజు
||దేవుడు మనిషిగా||
పాపియైన మనిషిని
ప్రేమించి
తండ్రి మాట మీరక
తలవంచి
తనను తాను తగ్గించుకొని నరుడై జన్మించీ
మనకు బదులు శిక్షను
భరియించి
సిలువపైన రక్తం
చిందించి
మనవిడుదల కొరకై తన ప్రాణం అర్పించీ
మరణం గెలిచిన జయశాలి
అతడెవరో నువ్ గుర్తించాలి
మనం చేసిన దేవుడు కాదు
మనలను చేసిన దేవుడు యేసు
||దేవుడు మనిషిగా||
----------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune : Kiran Gunnampati
Music & Vocals : Samuel Dasari & Boda Jayanth Madhur
----------------------------------------------------------------------------------------