4437) తూర్పు దిక్కున చుక్క పుట్టేను ప్రజలందరికీ వార్త తెచ్చేను


** TELUGU LYRICS **

తూర్పు దిక్కున చుక్క పుట్టేను
ప్రజలందరికీ వార్త తెచ్చేను 
దూత ఒకటి దర్శనమిచ్చేను
ప్రజలందరికి శుభవార్త తెచ్చేను
ఇక సంతోషమే ఇక సాంబారమే
లోక రక్షకుడు పుట్టాడని
సర్వ లోకాధికారి వచ్చాడని
హే పాపుల రక్షకుడు పుట్టాడని
హే పరమును వీడి వచ్చాడని

పరిశుద్దత్మతో కన్య మరియా గర్భనా
పరమును వీడి పశువుల పాకలోన
పాపమును బాపుటకు పరిశుద్దుడిలా
ప్రజలను విడిపించ ప్రభువు దిగి వచ్చేను
సంతోషమే ఇక సాంబారమే
పాపుల రక్షకుడు వచ్చాడని
ప్రజలందరి ప్రభువు వచ్చాడని (2)

బాలుడు కాదయ్య బలవంతుడు యేసయ్య
సర్వ లోకానికి రక్షణ తెచ్చాడయ్య
ప్రభువును నమ్మితే పాపము పోవునయ్యా
నమ్మిన వారికీ నరకము తప్పించేనాయ్య
సంతోషమే ఇక సాంబారమే
బలవంతుడు భువికే వచ్చాడని
సర్వ లోకానికే ప్రభువు వచ్చాడని (2)

హే మహిమను విడచి మనకై వచ్చాడు
మన అందరికి పరలోకం ఇచ్చాడు
అపవాదిని జయించుటకు వచ్చాడు
వాడి తలని చితక త్రోక్కుటకు వచ్చాడు
సంతోషమే ఇక సాంబారమే
హే మహిమ గల రాజు వచ్చాడని
రాజులకు రాజు పుట్టాడని (2)

-------------------------------------------------
CREDITS : Music : Enoch Jagan
Lyrics, Tune : Manoj David
-------------------------------------------------