4436) ఎంతో సంతోషమైన దినం యెహోవాయే పంపిన వరం


** TELUGU LYRICS **

ఎంతో సంతోషమైన దినం
యెహోవాయే పంపిన వరం (2)
ఉత్సాహాలతో మన మందరం
సంగీతాలతో ఆరాధిద్దాం
ఇక చేద్దాములే సంబరం (2)
పుట్టాడులే పుట్టాడులే
ఈ లోక రక్షకుడే
తెచ్చాడులే తెచ్చాడులే 
పరలోక మహిమ నేడే (2)
||ఎంతో||

మరియమ్మ గర్భాన మహరాజే పుట్టెను 
పరమందు దూతల సమూహాలే చేరేను (2)
లోకానికి శుభవార్త అపవాదికి దుర్వార్త
సాతానికి దడ పుట్టేరోయ్ (2)
పుట్టాడులే పుట్టాడులే
ఈ లోక రక్షకుడే
తెచ్చాడులే తెచ్చాడులే
పరలోక మహిమ నేడే (2)
||ఎంతో||

యేసయ్య రాకతో లోకమే హర్షించెను
గగనాన తారల వెలుగులే విరజిమ్మెను (2)
ఈ శుభ సమయనా ఈ రేయి మనలోన
నవ్వులే నాట్యము చేసేరోయ్ (2)
పుట్టాడులే పుట్టాడులే
ఈ లోక రక్షకుడే
తెచ్చాడులే తెచ్చాడులే
పరలోక మహిమ నేడే (2)
||ఎంతో||

-----------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Padala Suresh Babu
Vocal & Music : Vijay Samson & Vijay Samuel
-----------------------------------------------------------------------