4450) సంబరమేనంట శ్రీయేసు జననమంట సంతోషమేనంట యీనాడు ప్రతి ఇంట


** TELUGU LYRICS **

సంబరమేనంట శ్రీయేసు జననమంట
సంతోషమేనంట యీనాడు ప్రతి ఇంట (2)
నేడు రక్షకుడు మనకొరకు పుట్టేనంట
మన పాపాలు తొలగింప వచ్చేనంట (2)
అ.ప: సంబరమేనంట... సంబరమేనంట (2)
||సంబర||

గాబ్రియేలు దూత వచ్చేనంట శుభవార్తను తెచ్చేనంట 
కన్య మరియమ్మ గర్భమునందు దేవదేవుని జననమంట (2)
యోసేపు సందేహపడెనంట మరియను విడనాడ తలచెనంట
దూత ప్రత్యక్షమాయెనంట సంగతిని బయలుపరచెనంట (2)
సంబరమేనంట... సంబరమేనంట (2)
||సంబర||

రాజైన హేరోదుకు తెలిసేనంట బహుగా కలవరమొందేనంట
జ్ఞానులందరిని పిలిచేనంట శిశువు జాడకై పంపేనంట (2)
తార దారిని చూపేనంట జ్ఞానులు యేసును దర్శించారంట 
దేవుని మాటననుసరించారంట వేరొక మార్గమున వెళ్ళారంట (2)
సంబరమేనంట... సంబరమేనంట (2)
||సంబర||

------------------------------------------------------
CREDITS : Music : Bannu
Lyrics, tune, Vocals : Raju Richards
------------------------------------------------------