4369) రాజుల రాజా ప్రభువుల ప్రభువా ఆది దేవుడా యేసయ్యా


** TELUGU LYRICS **

రాజుల రాజా ప్రభువుల ప్రభువా
ఆది దేవుడా యేసయ్యా
సత్య దేవుడా నిత్య దేవుడా
నీతి సూర్యుడా నా ప్రభువా  
ఓ యేసు నా ప్రభువా నీ అండే నాకు చాలు
నా యేసు నా దేవా నీ కృపయే నాకు చాలు

సత్యము నీవే మార్గము నీవే - జీవము నీవే యేసయ్యా
ఆకలి తీర్చే దప్పిక తీర్చే - జీవాహారం నీవయ్యా
ఓ యేసు నా ప్రభువా నీ అండే నాకు చాలు
నా యేసు నా దేవా నీ కృపయే నాకు చాలు

చీకటిలోని జనులందరికి వెలుగైనావే యేసయ్యా
కల్వరి గిరిలో ప్రాణం పెట్టిన ప్రేమమయుడా నీవయ్యా
ఓ యేసు నా ప్రభువా నీ అండే నాకు చాలు
నా యేసు నా దేవా నీ కృపయే నాకు చాలు

----------------------------------------------------------------------
CREDITS : Lyrics : Pastor.Raju Goduguchinta
Vocals : Sis.Indira Goduguchinta 
----------------------------------------------------------------------