4368) కృతజ్ఞతలు చెల్లించుచు నీ మందిరములో ప్రవేశించెదన్


** TELUGU LYRICS **

కృతజ్ఞతలు చెల్లించుచు నీ మందిరములో ప్రవేశించెదన్ 
కృపలను తలంచుచు నీ పాదముల్ ముద్దాడెదన్
లెక్కలేనన్ని పాపములను నీ రక్తముతో కడిగి
లెక్కించలేని స్తోత్రములతో నా నోటిని నింపిన...నీకే      
||కృతజ్ఞతలు||

దివి నుండి నాకై దిగి వచ్చావు
మహి నుండి నన్ను నీలో చేర్చుటకు
మరుగైన మన్నా నాకొసగావు
మెరుగైన సత్యం నాకు నేర్పావు
లెక్కలేనన్ని పాపములను నీ రక్తముతో కడిగి
లెక్కించలేని స్తోత్రములతో నా నోటిని నింపిన.. నీకే...
||కృతజ్ఞతలు||

వేటగాని ఉరి నుండి విడిపించావు
సాటిలేని ప్రేమతో నన్ను ప్రేమించావు
విశ్వాసులకు మాదిరిగా నన్నుమార్చావు
నీవు చూపిన ఈ కృపకై ఏమివ్వగలను
లెక్కలేనన్ని పాపములను నీ రక్తముతో కడిగి
లెక్కించలేని స్తోత్రములతో నా నోటిని నింపిన... నీకే...                            
||కృతజ్ఞతలు||

తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి
సరియైన త్రోవలో నన్ను నడిపావు
వేల లేని నన్ను నీవే  ప్రేమించి విలువైన రక్తం నాకై కార్చావు
లెక్కలేనన్ని పాపములను నీ రక్తముతో కడిగి
లెక్కించలేని స్తోత్రములతో నా నోటిని నింపిన... నీకే...                      
||కృతజ్ఞతలు||

------------------------------------------------------------------------------------
CREDITS : Music : Praveen Gandham
Lyrics & Singer : Pilli Kumara Swamy & Surya Prakash
------------------------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments