4484) రాజు పుట్టెను రాజు పుట్టెను లోకమంతా సందడి ఆయెను


** TELUGU LYRICS **

రాజు పుట్టెను రాజు పుట్టెను 
లోకమంతా సందడి ఆయెను (2)
ఊరు వాడా పండుగాయెను (2)
కాంతులతో మెరసిపోయెను (2)
రాజు పుట్టెను మహారాజు పుట్టెను 
లోకమంతా సందడి ఆయెను 

దూతలు వెళ్లిరి గొల్లలకు తెల్పిరి 
లోక రక్షకుడు పుట్టాడని (2)
అంధకారమైన  బ్రతుకును మార్చుటకు 
చీకటినుండి వెలుగులో నడుపుటకు (2)
రాజు పుట్టెను మహారాజు పుట్టెను 
లోకమంతా సందడి ఆయెను 
||రాజు పుట్టెను||

జ్ఞానులు వెళ్లిరి యేసుని చూచిరి 
సంతోషముతో ఆరాధించిరి (2)
మన జీవితము మార్చుకొనుటకు 
ఇదియే సమయము ఆసన్నమాయెను (2)
రాజు పుట్టెను మహారాజు పుట్టెను 
లోకమంతా సందడి ఆయెను 
||రాజు పుట్టెను||

---------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Shyam Joseph 
Vocals & Music : Paul Emmanuel & Pravin Singh 
---------------------------------------------------------------------------