4485) ఆహా.. క్రిస్మస్.. Telugu Songs Medley


** Telugu Christmas Lyrical Songs Medley**

    రక్షకుండుదయించినాడట - మన కొరకు పరమ 
    రక్షకుండుదయించినాడట 
    రక్షకుండుదయించినాడు - రారే గొల్ల బోయలార 
    తక్షనమున బోయి మన ని - రీక్షణ ఫల మొందుదాము 
    రక్షకుండుదయించినాడట - మన కొరకు పరమ 
    రక్షకుండుదయించినాడట

    కన్య గర్భమందు - నీవు పుట్టావయ్యా
    పరిశుద్దునిగా నీవు - మా కొరకు వచ్చావయ్యా 
    పశుల పాకలో - పశుల తొట్టెలో 
    పసి బాలుడిగా - ఉన్నావయ్యా

    ఓ ఓ ఓ ఓ ఓ - ఓ ఓ ఓ ఓ ఓ - ఓ ఓ ఓ ఓ ఓ
    రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు - పుట్టే బాల యేసునిగా
    గొల్లలెల్ల చూచిరి జ్ఞానులారాధించిరి - దూత తెలియజేయంగా 
    సర్వమానవాళికి సంతోషమైన వార్త - ఆయన ప్రజలందరికీ సమాధానము

    తూరురు రురు రూ రురురు - తూరురు రురు రూ రురురు
    తూరురు రురు రూ రురురు - తూరురు రురు రూ రురురు
    జన్మించినాడు శ్రీ యేసు రాజు - బెత్లెహేమందున
    సర్వోనతుడు వెలసినాడు - రక్షణిచ్చుటకు
    అక్షయ మార్గము - నడిపించే మానవుడై
    నిజమే నిజమే - దీన నరుడై ఉదయించే
    రేడు నేడు జనియించినాడు - ఆనందం అద్భుతం
    రేడు నేడు జనియించినాడు - సంతోషం సమాధానం

    రాజులనేలే రారాజు - వెలసెను పశువుల పాకలో
    పాపుల పాలిట రక్షకుడు - నవ్వెను తల్లి కౌగిలిలో
    భయము లేదు మనకిలలో - జయము జయము జయమహో (2)

    ఇది శుభోదయం - క్రీస్తు జన్మదినం 
    ఇది లోక కళ్యాణం - మేరి పుణ్యదినం
    మేరి పుణ్యదినం

    గొల్లలు జ్ఞానులు చేరిరి యేసుని
    కానుకలిచ్చిరి ప్రేమను పంచిరి - ఆనందమాయెగా
    ఆనందమాయెగా పాపము పోయెను
    ఆనందమాయెగా పాపము పోయెను
    పరము వీడి భువికి దిగిన యేసుని కొలువ
    ఆకాశ వీధిలో కాంతులు చిందగా
    కన్నుల విందుగా వెలిగిను తారొకటి
    ఆకాశ వీధిలో కాంతులు చిందగా
    కన్నుల విందుగా వెలిగిను తారొకటి - ఆకాశ వీధిలో

    ఇమ్మానుయేలుగా - యేసే మనకు తోడుగా
    ఇలను జన్మించెగా - భయము లేదుగా
    ఇమ్మానుయేలుగా - యేసే మనకు తోడుగా
    ఇలను జన్మించెగా - భయము లేదుగా
    అందకారమైన - పొంగే సంద్రమైన
    నిన్ను విడువలేడు - యేసే నీకు తోడు
    జయం జయం - హోసన్నా జయం జయం
    శుభం శుభం - లోకానికి శుభం శుభం

    గగనమే మురిసెను - తారయే మెరిసెను
    పరమున దూతలే - పండుగ జేసెను
    జయం జయం - హోసన్నా జయం జయం
    శుభం శుభం - లోకానికి శుభం శుభం

    శ్రీ యేసుండు జన్మించే రేయిలో - శ్రీ యేసుండు జన్మించే రేయిలో
    నేడు పాయక బెత్లెహేమ యూరిలో - నేడు పాయక బెత్లెహేమ యూరిలో 
    కన్నియ మరియమ్మ గర్భమందున - కన్నియ
    కన్నియ మరియమ్మ గర్భమందున
    ఇమ్మానుయేలనెడి నామమందున - ఇమ్మానుయేలనెడి నామమందున 
    శ్రీ యేసుండు జన్మించే రేయిలో - శ్రీ యేసుండు జన్మించే రేయిలో
    నేడు పాయక బెత్లెహేమ యూరిలో - నేడు పాయక బెత్లెహేమ యూరిలో

    బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2)
    పశువుల శాలలో శిశువుగా పుట్టెను (2) 
    రండి రండి రండయో రక్షకుడు పుట్టెను (2)
    రక్షకుని చూడను రక్షణాలు పొందను (2)

    మురిసెను హృదయము - ముచ్చట తీరగా
    రాజు వెలయగా - మహారాజు వెలయగా
    తొలగెను మన భయం - కలిగెను స్థిర జయం
    కృపను నిండగా - ధరణి బ్రతుకు పండగ
    దీన బ్రతుకు గాధల్లో - జాలి చూప వచ్చాడమ్మో
    దీన బ్రతుకు గాధల్లో - జాలి చూప వచ్చాడమ్మో
    రారాజు పుట్టాడో - రాజ్యం తెచ్చాడో
    భూలోకమొచ్చాడో - భోజ్యం తెచ్చాడో
    రారాజు పుట్టాడో - రాజ్యం తెచ్చాడో
    భూలోకమొచ్చాడో - భోజ్యం తెచ్చాడో

    అర్ధరాతిరి పొద్దుకాడ - సద్దుమణిగే సందెకాడ
    ముద్దుగానే పుట్టినాడు - స్వామి యేసయ్యో
    భగ్గుమంటూ వెలుగు వచ్చే - సిగ్గు అంటూ చీకటి పోయే
    మొగ్గలాంటి చుక్క పుట్టే - రారాజేసయ్యో
    ఏరా బాబు పోదాం బాల యేసుని చూద్దాం
    బోసి నవ్వులన్నీ చూసి మూటగట్టు
    రారాజు పుట్టాడో - రాజ్యం తెచ్చాడో
    భూలోకమొచ్చాడో - భోజ్యం తెచ్చాడో
    రారాజు పుట్టాడో - రాజ్యం తెచ్చాడో
    భూలోకమొచ్చాడో - భోజ్యం తెచ్చాడో

    సందడి మొదలాయే - మన యేసయ్య పుట్టాడని
    సందడి మొదలాయే - మన రారాజు పుట్టాడని
    బెత్లహేములో బలవంతుడు - పుట్టినాడని సందడి
    పశుశాలలో పరిశుద్ధుడు - పుట్టినాడని సందడి
    మిళుక్కుమంటూ తళ్ళుక్కుమంటూ - చుక్కలు చేసే సందడి 
    హోసన్న అంటూ పాటలు పాడి - దూతలు చేసే సందడి 
    సందడి మొదలాయే - మన యేసయ్య పుట్టాడని
    సందడి మొదలాయే - మన రారాజు పుట్టాడని
    సందడి మొదలాయే - మన యేసయ్య పుట్టాడని
    సందడి మొదలాయే - మన రారాజు పుట్టాడని (2)

    దీనాతి దీనడై - పశువుల పాకలో 
    మరియమ్మ ఒడిలో - ఆ చల్లని చలిలో 
    స్థలమే దొరకాలేదే - దేవాది దేవునకు 
    ఎంత కఠినాత్ముడు-  ఈ మాంటి మానవులు 
    అయినా నా తండ్రి యేసు - నాకై జన్మించెను 
    మా మంచి యేసయ్యా - మా కోసమే పుట్టేనాయ్యా 

    ఇళ్లలోన పండుగంట - కళ్ళలోన కాంతులంట
    ఎందుకో ఎందుకే కోయిలా - చెప్పవే చెప్పవే కోయిలా
    మల్లెపూల మంచు జల్లు - మందిరాన కురిసె నేడు
    ఎందుకో ఎందుకే కోయిలా - చెప్పవే చెప్పవే కోయిలా
    ఆ అర్దరాత్రి కాలమందు వెన్నెల ఆహా
    ఆశ్చర్యకరుడంట వెన్నెల ఆహా (2)
    జన్మించినాడంట వెన్నెలా
    ఈ అవనిలోనంట వెన్నెలా (2)

    గగనాన తారాలెన్ని ఉన్నాను 
    వెలుగిచ్చు సూర్యచంద్రులున్నాను 
    రక్షకుని జన్మ వార్తా జగమంతా చాటగా (2)
    అరుదెంచే ధివిలో నవ్య తారక 

    హల్లెలూయా ఆర్పణలు - ఉల్లముతో చెల్లింతుం 
    రాజాధి రాజునకు - హోసన్నా ప్రభునకు (2)
    సర్వోన్నత స్థలములలో - సమాధానము 
    ప్రాప్తించే ప్రజ కొరకు - ప్రభు జన్మముతోనూ 

    అంగరంగ వైభవంగా - పండుగఏంటంటా 
    ఊరు వాడ పిల్లా జల్లా - సందడిఏంటంటా 
    ఎక్కడ చూసిన క్రిస్మస్ అంటూ - సంభారమేంటంటా 
    ఏం చేస్తారో ఏం చెబుతారో - చూస్తేఏంటంటా (2)
    చిన్నా పెద్దా తేడా లేదు 
    పేదా ధనిక భేదం లేదు 
    పండుగ పామర తేడా లేదు 
    పల్లె పట్నం తేడా లేదు 
    భూలోకానా ప్రజలందరికీ పండుగ వచ్చింది 
    కారణం యేసు జననం (2)
    యేసు జననం జగమంతా ఉల్లాసం (2)

    చీకటి బ్రతుకున వెలుగే వచ్చిన కారణం - యేసు జననం
    పాపము నుండి విడుదల కలిగిన కారణం - యేసు జననం
    మరణముపైన విజయము పొందిన కారణం - యేసు జననం
    దేవుని రాజ్యం భువిపైకొచ్చిన కారణం - యేసు జననం
    పరమాత్ముని స్వారూప్యమే - భువిపైన నడయాడగా 
    పరలోకపు వైభోగమే - భూలోకమునకొచ్చెనే  
    సంతోషమే యేసు జననం 
    సంబరమే యేసు జననం (2) 

    తూరుపంత వెలుగు నింపే - తార ఒకటి నేడు వెలుగుతోంది చూడు
    చీకటింక మాయం - పాపమంత దూరం 
    చిన్ని యేసు - జగతికింక నేస్తం
    అనగనగ ఒక ఊరుంది - ఆ ఉరు బేత్లెహేము
    బేత్లెహేము ఊరిలోన - యోసేపను మనుజుని యింట
    మరియమ్మను కన్నియ ఉంది
    దైవబలము కలిగిన యువతీ
    ఆ కన్నియా గర్బములోన - ఓ బాలుడు ఉదయించాడు
    ఆ బాలుడు యేసయ్యంట ఓరయ్యా  
    దేవా దూత సేలవిచ్చాడు వినవాయ్యా (2)

    ఓ సద్భాక్తులారా లోక రక్షకుండు 
    బెత్లేహేమందు నేడు జన్మించెన్
    రాజాధి రాజు ప్రభువైన యేసు
    నమస్కరింప రండి నమస్కరింప రండి 
    నమస్కరింప రండి ఉత్సాహముతో 

    Glooooo...ria 
    In Excelsis Dio.. 
    దూత పాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి
    ఆ ప్రభుండు పుట్టెను - బెత్లెహేమునందున
    భూజనంబు కెల్లను - సౌఖ్య సంభ్రమాయెను
    ఆకసంబు నందున - మ్రోగు పాట చాటుడి
    దూత పాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి

    Hark The Herald Angels Sing
    Glory To The Newborn King
    Peace On Earth And Mercy Mild
    God And Sinners Reconciled
    Joyful All Ye Nations Rise
    Join The Triumph Of The Skies
    With Thangelic Host Proclaim
    Christ Is Born In Bethlehem

    Hark The Herald Angels Sing
    Glory To The Newborn King

------------------------------------------------------------
    CREDITS : Samuel Karmoji & Team
------------------------------------------------------------