4470) ఓ సల్లగాలి కాలంలోన కాంతేలేని రేయిలోన


** TELUGU LYRICS **

ఓ సల్లగాలి కాలంలోన కాంతేలేని రేయిలోన (2)
వెలిసింది ఓ తార ఆకాశన పుట్టాడు నా దేవుడు ఈ లోకానా
||ఓ సల్లగాలి||

రాజుల రాజు యేసు రాజు మనకై దిగి వచ్చేగా 
మంచిని పెంచ చెడునే తుంచ భువికే దిగి వచ్చేగా (2)
సంబరమే సంబరమే యెరూషలేముకు సంబరమే 
సంబరమే సంబరమే లోకానికి ఇది సంబరమే (2)
||ఓ సల్లగాలి||

దేవదేవుడు ఆశ్రయదుర్గము మనకై దిగి వచ్చేగ 
జీవము నివ్వ మరణము గెలువ దైవమే దిగి వచ్చేగా (2)
సంబరమే సంబరమే యెరూషలేముకు సంబరమే 
సంబరమే సంబరమే లోకానికి ఇది సంబరమే (2)
||ఓ సల్లగాలి||

------------------------------------------
CREDITS : Br. Sam Ovens 
------------------------------------------