4469) అంబరాన్ని వెలిగింది ఒక తార సందడే తెచ్చింది ఈవేళ


** TELUGU LYRICS **

అంబరాన్ని వెలిగింది ఒక తార సందడే తెచ్చింది ఈవేళ
గగనమంతా వెలుగుతో‌ నింపింది ఈ జగమంతా ఆనందం తెచ్చింది (2)
క్రిస్తుని జననవార్త చాటింది క్రీస్తు చెంతకు జనులను నడిపింది (2)
సంబరం సంబరం క్రీస్తు పుట్టిన సంబరం
సంబరం సంబరం క్రిస్మస్ ఆరాధన సంబరం (2)

యెరూషలేము నందున దావీదు పట్నమందు
బేత్లేహేము పురములో క్రీస్తు పుట్టిన నందున (2)
తూర్పు దేశపు జ్ఞానులు యేసుని‌ పూజింపగా  
నక్షత్రం జ్ఞానులకు దారిచూపేను (2)
యూదుల రాజును కనులారాచూసి 
బంగారు సాంబ్రాణి అర్పించిరి (2)
||సంబరం||

ఆదేశమునందున యూదా వంశమందు
కన్య మరియ గర్భములో యేసు పుట్టినందున (2)
గొర్రెల కాపరులు క్రీస్తుని దర్సింపగా
దేవదూత కాపరులకు శుభవార్త చెప్పేను (2)
సమదాన కర్తను కనులారాచూసి
విన్నా కన్నా వాటిని ప్రచురపరచేను (2)
||సంబరం||

--------------------------------------------------------------
CREDITS : Music : Kolli Nanaji
Lyrics, Tune, Sung By : Uba Anand Raju
--------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments