4396) నేను నేనన్నదంతయు నీదే నా యేసయ్యా

 

** TELUGU LYRICS **

నేను నేనన్నదంతయు నీదే నా యేసయ్యా
నాకు నాకున్నదంతయు నీవే నా యేసయ్యా
ఏమైనా నేను ఏమైనా తోడున్నా ఎవరు లేకున్నా
నీ నామమే స్మరియిస్తూ నిన్నే స్తుతియించెదను 

చుక్కలన్నీ లెక్కకు చాలునా? నీవు చేసిన మేలులకంటే 
ఆకశమంతా పరచిన చాలునా? హద్దులెరుగని నీ ప్రేమకంటే
అంతరిక్షమంతటికి ఏకైక రాజువు 
నాకోసం రానున్న నా తండ్రి నిన్ను తలచి 
ఉరుములైనా మెరుపులైనా వరదలైనా వడగండ్లయినా
నీ నామమే స్మరియిస్తూ నిన్నే స్తుతియించెదను

కోతకాలపు కొడవలి పదునా? దుష్టులాడే దుర్భాషకన్నా 
వేటగాలపు ఉక్కులు పదునా? మనసుగుచ్చే మాటలకన్నా 
కాళ్ళు కరముల ఉక్కులు నొక్కగా 
నాకై మొక్కిన నా తండ్రి నిన్ను తలచి
ఉచ్చులైనా చిచ్చులైనా కత్తులైనా కోతలైనా
నీ నామమే స్మరియిస్తూ నిన్నే స్తుతియించెదను

--------------------------------------------------
CREDITS : Music : Moses Dany 
Vocals: Sruthi Betty 
--------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments