4397) కృతజ్ఞత స్తుతులు చెల్లించి నూతన గీతము నే పాడనా


** TELUGU LYRICS **

కృతజ్ఞత స్తుతులు చెల్లించి
నూతన గీతము నే పాడనా
నీ కనికరములు నే స్మరియించి
నీ నామ కీర్తన నే చేయనా
స్తోత్రం యేసయ్య స్తుతి స్తోత్రం యేసయ్య
స్తోత్రం యేసయ్య స్తుతి స్తోత్రం యేసయ్య

పడిపోవు వారిని ఉద్దరించువాడ
క్రుంగిన వారిని లేవనెత్తువాడ
ఆనాధలకు ఆశ్రయుడా
దిక్కులేని వారికి సహాయుడా

నా కొరకై ప్రాణము పెట్టినవాడ
నీ శుద్ధ రక్తముతో కడిగినవాడ
శ్రేష్ఠ ఈవులతో దీవించువాడ
నిత్య జీవము నా కిచ్చువాడ

-------------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune : Joshua Krupakar
Music & Vocals :  Sunil Kumar & Vamsi
-------------------------------------------------------------------