4375) నేనెచటికేగినా నీవచట ఉందువు నన్ను నిర్మించిన ప్రియతండ్రివి


** TELUGU LYRICS **

నేనెచటికేగినా నీవచట ఉందువు 
నన్ను నిర్మించిన ప్రియతండ్రివి 
వెదకి రక్షించిన కరుణామయుడవు 
నా కనులు తెరచిన సత్యసాక్షివి 

ఆహా ఎంత వరం కలువరిత్యాగఫలం 
సమర్పణాసారం మాకదే ఆధారం 

మరణభయపు శ్రమల దారి నడచిన ధీనుని కనుగొనిన 
సిలువదారి యాగఫలముగా విడుదల వరమిచ్చినా 
పునరుద్ధాన బలమునందించ మృతినేగెల్చితివా 
ఎన్ని కడగండ్లు వచ్చినా జయమున నిలిపితివా 

భ్రమల నడుమ వేతల దారి తిరిగిన మూఢుని ప్రేమించిన 
యవ్వనకాల రుధిర ధారతో మనిషిగా ననునిలిపిన 
అనురాగాన ఆధారనిచ్చి అక్కున చేర్చితివా 
ఇంత కడుఘోర పాపికి కృపానందించితివా 

-------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Music, Vocals : Pas.Zoel Sog
-------------------------------------------------------------------------