4376) కొండల తట్టు నా కనులెత్తుచున్నాను గుండెల నిండా బాధలు


** TELUGU LYRICS **

కొండల తట్టు నా కనులెత్తుచున్నాను
గుండెల నిండా బాధలు బరువెక్కి యున్నాను 
నా గోడు విను వారు లేక - నా తోడు ఎవ్వరు రాక
నీ వైపు చూశాను దేవా నిన్నాశ్రయించాను 
ఆరాధన ఇది నా ఆరాధన 
ఆత్మతో సత్యముతో ఆరాధన 
ఆరాధన ఇది నా ఆరాధన 
విరిగి నలిగిన మనస్సుతో ఆరాధన 
కొండల తట్టు నా కనులెత్తుచున్నాను
గుండెల నిండా బాధతో బరువెక్కియున్నాను
 
నన్నుగా నన్ను నన్నుగా ప్రేమించువారు లేరు ఇక్కడ 
మిన్నగా నీకంటే మిన్నగా కరుణించు వారు లేరు ఎక్కడ (2)
ఆరాధన ఇది నా ఆరాధన 
తప్పులు మన్నించినందుకు ఆరాధన 
ఆరాధన ఇది నా ఆరాధన
ఒప్పులు నేర్పించినందుకారాధన 
కొండల తట్టు నా కనులెత్తు చున్నాను
గుండెల నిండా ప్రేమతో నిను నింపుకున్నాను 

పాపిగా నేను ఉండగా చీదరించుకున్న వారు ఇక్కడ
(ఈ) పాపినే  ప్రేమించగా పరలోకం విడిచి వచ్చినావుగా (2)
ఆరాధన ఇది నా ఆరాధన
శిక్షను తప్పించినందుకారాధన
ఆరాధన ఇది నా ఆరాధన
శిక్షణ ఇప్పించినందుకారాధన
కొండల తట్టు నా కనులెత్తుచున్నాను
గుండెల నిండా దేవా నిన్ను నింపుకున్నాను 

శ్రమలలో నలుగుతుండగా స్పందించువారు లేరు ఇక్కడ
సిలువలో బహు శ్రమలలో ప్రాణమిచ్చి నన్ను కొన్నావుగా (2)
ఆరాధన ఇది నా ఆరాధన 
నా స్థానము పొందినందుకారాధనా
ఆరాధన ఇది నా ఆరాధన
నీ స్థానం ఇచ్చినందుకారాధన

కొండల తట్టు నా కనులెత్తుచున్నాను
గుండెల నిండా బాధలు బరువెక్కియున్నాను
నా గోడు వినువారు లేక-నా తోడు ఎవ్వరురాక 
నీ వైపు చూశాను దేవా నిన్నాశ్రయించాను
ఆరాధన ఇది నా ఆరాధన
ఆత్మతో సత్యముతో ఆరాధన
ఆరాధన ఇది నా ఆరాధన 
విరిగినలిగిన మనస్సుతో ఆరాధన (2)

------------------------------------------------
CREDITS : Vijay Prasad Reddy 
------------------------------------------------