** TELUGU LYRICS **
నీవేగ నను వెదకుచు ఈ భువికేతెంచినవాడవు
నీవేగ పేరుతో పిలిచి నను బలపరచినవాడవు
నీవే నా రక్షణ నీవే నిరీక్షణ
నీవే విమోచన యేసు రాజా
నీకే ఆరాధన ఈ స్తుతి ఆలాపన
దినమెల్ల పాడనా ప్రాణనాధా
నీవేగ పేరుతో పిలిచి నను బలపరచినవాడవు
నీవే నా రక్షణ నీవే నిరీక్షణ
నీవే విమోచన యేసు రాజా
నీకే ఆరాధన ఈ స్తుతి ఆలాపన
దినమెల్ల పాడనా ప్రాణనాధా
నను పిలచిన దేవుడ నీవే నను మలచిన ప్రభుడవు
నీవే నను వలచిన నాధుడ నీవే నా యేసు
నను కడిగిన ఉదకము నీవే నా రక్షణ పధకము నీవే
నీ కృప అత్యధికము నా ఎడ నా యేసు
నీవే నా జీవాధారం నీ యందే నా అతిశయం
నీవే నా బల సౌందర్యం నీ యందే నా ఐశ్వర్యం
నిను కొలిచెద నే మనసారా మనోహరుడా
నను కడిగిన ఉదకము నీవే నా రక్షణ పధకము నీవే
నీ కృప అత్యధికము నా ఎడ నా యేసు
నీవే నా జీవాధారం నీ యందే నా అతిశయం
నీవే నా బల సౌందర్యం నీ యందే నా ఐశ్వర్యం
నిను కొలిచెద నే మనసారా మనోహరుడా
ధర జనులకు వెలుగువు నీవే చెర నుండి విడుదల
నీవే కరములెత్తి నిను స్తుతియింతును నా యేసు
మరణమును జయించితి నీవే పరపురముకు మార్గము నీవే
మరణమును జయించితి నీవే పరపురముకు మార్గము నీవే
అమరత్వము నొసగుము నాకు నా యేసు
నీవే నా ఉన్నత శిఖరం నీ యందే నా సర్వస్వం
నీవే నా జీవిత తీరం నీ యందే నా నిత్యత్వం
సదా నిన్ను ప్రణుతించెదను ప్రాణేశ్వరా
నీవే నా ఉన్నత శిఖరం నీ యందే నా సర్వస్వం
నీవే నా జీవిత తీరం నీ యందే నా నిత్యత్వం
సదా నిన్ను ప్రణుతించెదను ప్రాణేశ్వరా
------------------------------------------------------------------
CREDITS : Vocals : Surya Prakash Injarapu
Music : Michael Benjamin Kalyanapu
------------------------------------------------------------------