4348) నీ చిత్తం నా యెడల జరిగించుము నీ ప్రణాళికలో నేనుండుట భాగ్యము


 ** TELUGU LYRICS ** 

నీ చిత్తం నా యెడల జరిగించుము 
నీ ప్రణాళికలో నేనుండుట భాగ్యము (2)
నీ సంకల్పం నెరవేర్చుట నాకు ఆనందము 
నీ నెరవేర్పులో నేనుండుట ఆశీర్వాదము (2)
నీ చిత్తమును నెరవేర్చెదను అనుదినము 
నీ మాటకు నే లోబడతాను ప్రతి క్షణము (2)

జగతికి పునాది వేయక ముందే నను ఏర్పరచావు 
గర్భములో రూపింపక ముందే పిలుచుకొన్నావు  (2)
ఈ సృష్టిని నోటి మాటతో చేసిన దేవుడవు నీవు 
నీ స్వహస్తములతో నను నిర్మించిన ప్రభుడవు నీవు (2)
నీ చిత్తమును నెరవేర్చెదను అనుదినము 
నీ మాటకు నే లోబడతాను ప్రతి క్షణము (2)

పాపములో పడియుండగా నన్ను లేవనెత్తావు 
మలినమునంతా కడిగి నాకు అర్హతనిచ్చావు (2) 
వెలకట్టి నాకు విలువను ఇచ్చిన దేవుడవు నీవు 
నీ రాజ్యములో స్థిర స్థానమునిచ్చిన ప్రభుడవు నీవు (2)

** ENGLISH LYRICS **

Nee Chitham Naa Yedala Jariginchumu
Nee Pranaalikalo Nenunduta Bhaagyamu (2)
Nee Sankalpam Neraverchuta Naaku Aanandamu 
Nee Neraverpulo Nenunduta Aasheervadamu (2)
Nee Chithamunu Neraverchedhanu Anudhinamu
Nee Maataku Ne Lobadathaanu Prathi Kshanamu (2)

Jagathiki Punaadhi Veyaka Mundhe Nanu Erparachaavu
Garbhamulo Roopimpaka Mundhe Piluchukonnavu (2)
Ee Srushtini Noti Maatatho Chesina Devudavu Neevu 
Nee Swahasthamulatho Nanu Nirminchina Prabhudavu Neevu (2)

Paapamulo Padiyundaga Nannu Levanethaavu
Malinamunantha Kadigi Naaku Arhathanichaavu (2)
Vela Katti Naaku Viluvanu Ichina Devudavu Neevu 
Nee Raajyamulo Sthira Sthaanamunichina Prabhudavu Neevu (2)

--------------------------------------------------------------------------------------------------------
CREDITS : Tune : Bro. Dinesh Endabetla
Lyrics : Bro. Dinesh Endabetla & Evg. Joel N Bob
Music, Vocals :  Ps. Issac Pilli, Ankitha Kaki Golla & Evg. Joel N Bob
--------------------------------------------------------------------------------------------------------