4365) నే మారిపోయినా నీవు మారనన్నావు నా ప్రేమ మారినా నీ ప్రేమ మారదు


** TELUGU LYRICS **

నే మారిపోయినా నీవు మారనన్నావు 
నా ప్రేమ మారినా నీ ప్రేమ మారదు (2)
ఇదియేమి బంధమో నీ ప్రేమ అనుభందం (2)
వర్ణంచలేను నీ ప్రేమను 
వివరించలేను నీ ప్రేమను 
||నే మారి||

నేనెంత వద్దన్నా  నావెంట పడ్డావు
వెంటాడి వెంటాడి నీవైపు తిప్పావు (2) 
నేను మాట్లాడకున్నా నాతోనే మాటాడి (2)
నా మదిని గెలిచావు నా దైవమైనావు (2)  
||నే మారి||

నాలో యేమిలేకున్నా                      
యేరికోరుకున్నావు నేనేమి కాకున్నా                                       
నా ప్రాణమన్నావు (2)
నేను నిన్ను యెరుగకున్నా నీవు నన్ను యెరిగావు (2)  
నా హ్రుదిలొ నిలిచావు నా తండ్రివైనావు (2)

నేనేమి అడగకున్నా నాకన్ని                
యిచ్చావు ఆశ్చర్యకార్యములెన్నో నాపట్ల చేశావు (2)  
ఊహంచలేనంత ఉన్నతముగ ఉంచావు (2)  
నన్ను నీకొరకే అర్పించుకొందును (2)

------------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune : Sharon Praveen 
Music & Vocals : Linus & Akshaya Praveen 
------------------------------------------------------------------