4342) నా ప్రాణ నేస్తమా నా యేసు దైవమా

 

** TELUGU LYRICS **

నా ప్రాణ నేస్తమా నా యేసు దైవమా (2)
నీ ధ్యాసలో నీ ప్రేమలో బ్రతకాలి నీ సాక్షిగా 
(2)
||నా ప్రాణ నేస్తమా||

ఆశ తీరా సేవించినా తియ్యనైన నీ ప్రేమను
అంతులేని ఆ ప్రేమలో పరవశించి కిర్తించనా
||నా ప్రాణ నేస్తమా||

నీవే ఉదయం నీవే అభయం నీతోనే జీవితo 
నీవే శరణం నాలో అనిశం నీ ప్రేమ శాశ్వతం 
మరువలేని నీ స్నేహము మధురమైన సంబంధము
కనులలోన నీ రూపము వెలిగే నాలో నీ దీపము
పలికే నాలో గీతమై నీదు ప్రేమ సంగీతమై
||నా ప్రాణ నేస్తమా||

నీవే శిఖరం  చూపే గమనం నీలోనే అమృతం 
నీతో సమయం కోరే తరుణం నీ ప్రేమ పావనం 
శిదిలిమైన నాప్రాణము కరుణ చూపే నీవాక్యము 
సిలువ చాటు నీ త్యాగము తెలిపే ప్రేమ సందేశము
పదములైన చాలునా నీదు ప్రేమ నేపాడనా 
||నా ప్రాణ నేస్తమా||

------------------------------------------------------------------------
CREDITS : Music : Pranam Kamlakhar
Lyrics & Vocals : Joshua Shaik & Priya Himesh
------------------------------------------------------------------------