** TELUGU LYRICS **
మరియ తనయుడై - మనుజావతారుడై
మహిలోన వెలసెను - మనకొరకై జన్మించెను
ఆనందమానందమే - లోకానికి శుభదినమే
ఆనందమానందమే - సర్వసృష్టికి సంతోషమే
మహిలోన వెలసెను - మనకొరకై జన్మించెను
ఆనందమానందమే - లోకానికి శుభదినమే
ఆనందమానందమే - సర్వసృష్టికి సంతోషమే
ఒక దూత తెలిపెను - గొల్లలకు శుభవార్తను
ఒక తార వెలిసెను - రారాజుని ప్రకటించెను
||ఆనందమానందమే||
బెత్లెహేము పురములో - దావీదు వంశంబులో
రక్షకుడు వెలసెను - మన పాపము తొలగించెను
||ఆనందమానందమే||
రాజులకే రాజుగా - ప్రభువులకే ప్రభువుగా
ఇమ్మానుయేలుగ - యేసయ్య జన్మించెగ
||ఆనందమానందమే||
----------------------------------------------------------------------------------------------------
CREDITS : Music : Dr.J.K.Christopher
Tune, Lyrics : Bro.Suresh Nittala, Singapore
Vocals : Sis Sharon Philip, Sis Lillian Christopher, Sis Hana Joyce
----------------------------------------------------------------------------------------------------