4461) ఆనందం మహా ఆనందం క్రీస్తు యేసులో ఆనందం సంతోషం పరమ సంతోషం


** TELUGU LYRICS **

ఆనందం మహా ఆనందం
క్రీస్తు యేసులో ఆనందం
సంతోషం పరమ సంతోషం
క్రీస్తు యేసులో సంతోషం (2)
దేవ దేవుడే భువికి తెచ్చిన ఆనందం
లోక పాపములు రూపుమాపగా సంతోషం (2)
||ఆనందం||

వాగ్ధానమే వాక్యరుపిగా వాగ్ధానమే 
శరీరదారియై జన్మించినాడు ఇలా 
పాపలోకమే పరిశుద్ధ పరచగా
సత్య వాక్యమై నడయాడినాడిలా (2)
తండ్రి చిత్తం మెరిగి తనకున్న మహిమ విడచి (2)
మనలని రక్షింప దీనుడై జన్మించే 
అందుకే 
||ఆనందం||

పరలోకమే మనలను పంపగా
దేవదేవుడే భువికి వచ్చినాడిల
నిత్య జీవమే మన సొంతమవ్వగా
సిలువ రక్తమే చిందించినాడిలా (2)
పాపలోకమంతా పరిశుద్ధపరచాలనే (2)
సిలువపై మరణించా నరరూపిగా జన్మించే
అందుకే 
||ఆనందం||

-------------------------------------------------------------------
CREDITS : Vocals : Asha Ashirwadh
Lyrics, Tune & Vocals : Sadhu Sundar singh
-------------------------------------------------------------------