4458) లోక రక్షకుడు ఉదయించేను మానవాళిని రక్షింపను


** TELUGU LYRICS **

లోక రక్షకుడు ఉదయించేను
మానవాళిని రక్షింపను (2)
ఎంత సంతసామో భువికి ఆనందము (2)
హలేలూయ హలేలూయ
హలేలూయ హలేలూయ (2)
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
మెర్రి క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ 
||లోక రక్షకుడు||

వేవేల దూతల గణములతో
కొనియాడాబడుచున్న ఆ దేవుడు
దీనుడై సాత్వీకుడై ధరణికేతించేను (2)
||హలేలూయ||

తూర్పు దేశపు జ్ఞానులు
చుక్కను కనుగొని పయనించి
బేత్లేహేమునకు చేరిరి కానుక లర్పించిరి (2)
||హలేలూయ||

రాత్రి వేళలో కాపరులు
మందను కాయు చుండగా
దేవధూత ప్రత్యక్షమై శుభవార్త చాటేను (2)
||హలేలూయ||

-----------------------------------------------------------------------------
CREDITS : Lyrics, tune : Bethapudi John Kennedy
Vocals & Music : Anjana Sowmya & KJW Prem
-----------------------------------------------------------------------------