4352) కలవరపడు సమయమునా ఆశ్రయమగు యేసయ్య


** TELUGU LYRICS **

కలవరపడు సమయమునా ఆశ్రయమగు యేసయ్య
భారమైన హృదయముతో నిన్ను
సహాయముకై వేడుచున్నాము
ఆదరించవా ఆదుకొనవా మమ్ము రక్షించ రావా

వెనుతిరుగా ఫరోసైన్యము 
మార్గములేని ఎర్ర సముద్రము
మేఘస్తంభమై కాచినావే
స్తుతి కీర్తనలతో దాటింప చేసినవే

మరణ కేకలే ధ్వనియిoచేనే  
పాతాళ ఉరులు బిగిసినే
భద్రము చేయ రెక్కలు చాచి
ఉన్నత దుర్గమై  కృపాధారమైతివే

జనము మీదికి జనము లేవగా 
రాజ్యము మీదికి రాజ్యము లేవగా
కరవు తెగులు రేగుచుండగా
కరుణామయుడ వై కాపాడుచుంటివే

----------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics : Vejendla Sampath Kumar 
Music & Vocals : Vejendla Rexson & Harsha Vardhan Chavali 
----------------------------------------------------------------------------------------------