4354) ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్య


** TELUGU LYRICS **

ఆశ్రయమా - ఆధారమా నీవే నా యేసయ్య
నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్య (2)
నిన్ను విడిచి నేను ఉండలేను
క్షణమైనా నీ బ్రతుకలేను(2)

కష్టకాలములు నన్ను కృంగదీసి నన్ను
అరణ్యరోదనలూ నన్ను ఆవరించినన్ను (2)
నా వెంట నీవుండి నావు - నీ కృపను చూపించినావు (2)
||ఆశ్రయమా||

భక్తిహీనులు నాపై పొర్లిపడిననన్ను
శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినన్ను (2)
నా వెంట నీవుండి నావు - కాపాడి రక్షించినావు(2)
||ఆశ్రయమా||

మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను
బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టినను (2)
నా వెంట నీవుండి నావు - దయ చూపి దీవించినావు (2)
||ఆశ్రయమా||

-------------------------------------------------------------
CREDITS : Vocals : Sis Snigdha Ratnam  
Lyrics, Tune, Music : Bro KY Ratnam
-------------------------------------------------------------