4351) గొప్ప దేవుడా గొప్ప చేయు దేవుడా నిన్నే ఆరాధించెదన్‌


** TELUGU LYRICS **

గొప్ప దేవుడా గొప్ప చేయు దేవుడా నిన్నే ఆరాధించెదన్‌
మంచి దేవుడా మేలు చేయు దేవుడా నీలో ఆనందించెదన్‌ (2)
గొప్ప దేవుడా శక్తిమంతుడా అద్భుతాలను జరిగించు దేవుడా (2)

మేలు చేసే వారు కరువై సొమ్మసిల్లిన వేళలో
ప్రాణహితులే మోసగించి చేయి విడిచిన వేళలో (2)
అదృశ్య రీతిలో ప్రత్యక్షమై నీ చేయి నావైపు చాపావయ్యా (2)
వర్ణించగలనా నీ మేలులు నా ఊహకందని కార్యములు
నిత్యము నిన్నే స్తుతించెదన్‌ (2)

శత్రుసేనలు వెనుక ముందు తరుముచున్న ఘడియలో
మరణ భయములు ఆవరించి కలతచెందిన వేళలో (2)
అదృశ్యరీతిలో ప్రత్యక్షమై అద్భుత మార్గాన్ని చూపావయ్యా (2)
బలమైనదయ్య నీ నామము బ్రతికించెనయ్యా నా ప్రాణము (2)
విజయము నిచ్చే నామము (2)

విలువలేని పొత్రగా నన్ను విసిరి వేసిన వేళలో
అన్నివైపులా నిందలే నన్ను బాధపరిచిన వేళలో (2)
అదృశ్యరీతిలో ప్రత్యక్షమై అనేకుల దీవెనకై నిలిపావయ్యా (2)
ఏమున్నదయ్యా అసాధ్యము నీకేమున్నదయ్యా అసాధ్యము (2)

-----------------------------------------------------
CREDITS : Music : Avinash Ansel
Vocals : Sangeetha Daniel paul
-----------------------------------------------------