4441) జన్మించెను రక్షకుడు మన కొరకు దిగి వచ్చెను యేసయ్య భువి వరకు


** TELUGU LYRICS **

జన్మించెను రక్షకుడు మన కొరకు
దిగి వచ్చెను యేసయ్య భువి వరకు (2)
మలినమైన మనుషుల కోసం
చేజారిన లోకం కోసం
మన చీకటి బ్రతుకుల కోసం
చిగురించే ఆశల కోసం
Happy Happy Christmas Merry merry christmas (2)

చ:  వాక్యనుసారము జరిగించుటకు
తన తండ్రి మాటలను నెరవేర్చుటకు (2)
రాజుల కే రాజుగా జ్ఞానులకే జ్ఞానిగా (2)
ఈ లోకమునకు ఏతెంచెను యేసు ఈ లోక రక్షకునిగా ఉదయించెను
||Happy||

న్యాయమును జరిగించుటకు
వ్యాధి బాధలను తొలగించుటకు (2)
ఆదరణ కర్తగా అందరికీ ప్రభువుగా (2)
ఈ లోకమునకు ఏతెంచెను యేసు ఈ లోక రక్షకునిగా ఉదయించెను
||Happy||

తన తండ్రి ప్రేమ ను ప్రకటించుటకు
ఈ లోక పాపమును తొలగించుటకు (2)
మహిమ గల వ్యక్తిగా మహోన్నత శక్తిగా (2)
ఈ లోకమునకు ఏతెంచెను
యేసు ఈ లోక రక్షకుని గా ఉదయించెను
||Happy||

-----------------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune : Bandela Naga Raju
Vocals & Music: Joshua Gariki & Suresh
-----------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments