** TELUGU LYRICS **
ఎంత ప్రేమ నీదయా యేసయా
ఇంతయని నేను వెలకట్టలేనయా
అంతులేని ప్రేమ నీది యేసయా
ఎంత పొగిడినా ఋణము తీరదయ్యా
యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ కొలుచుట సాధ్యమా వల్లకాదయా
ఏమని తెలుపను ఈ ప్రేమ జాడను శాశ్వతమైనది వింతైనది
లోకంలో ఎన్నో ప్రేమలున్ననూ
శోకంలో ఉండగా తోడుండవే
గాఢంగా ప్రేమించిన ప్రియులైననూ
చూడంగా కష్టాలలో దరి చేరరే
స్థితి ఏదైనా విడువని ప్రేమ
మృతి వరకైనా తోడుండే ప్రేమ
ప్రతి క్షణం వెన్నంటి ఆదరించు ప్రేమ
స్వార్థంతో నిండిన ఈ లోకంలో
స్వచ్ఛమైన ప్రేమను కనుపరచేదెవరు
చూచి చూడనట్లు నటించే ఈ భువిలో
వెదకి మరీ ప్రేమతో సంధించేదెవరు
వెదకని ప్రజకు దొరికిన ప్రేమ
వ్యథలను తీర్చి రక్షించిన ప్రేమ
ప్రేమించి ప్రాణాన్ని అర్పించిన ప్రేమ
ఇంతయని నేను వెలకట్టలేనయా
అంతులేని ప్రేమ నీది యేసయా
ఎంత పొగిడినా ఋణము తీరదయ్యా
యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ కొలుచుట సాధ్యమా వల్లకాదయా
ఏమని తెలుపను ఈ ప్రేమ జాడను శాశ్వతమైనది వింతైనది
లోకంలో ఎన్నో ప్రేమలున్ననూ
శోకంలో ఉండగా తోడుండవే
గాఢంగా ప్రేమించిన ప్రియులైననూ
చూడంగా కష్టాలలో దరి చేరరే
స్థితి ఏదైనా విడువని ప్రేమ
మృతి వరకైనా తోడుండే ప్రేమ
ప్రతి క్షణం వెన్నంటి ఆదరించు ప్రేమ
స్వార్థంతో నిండిన ఈ లోకంలో
స్వచ్ఛమైన ప్రేమను కనుపరచేదెవరు
చూచి చూడనట్లు నటించే ఈ భువిలో
వెదకి మరీ ప్రేమతో సంధించేదెవరు
వెదకని ప్రజకు దొరికిన ప్రేమ
వ్యథలను తీర్చి రక్షించిన ప్రేమ
ప్రేమించి ప్రాణాన్ని అర్పించిన ప్రేమ
-----------------------------------------------------------------------
CREDITS : Music: Jakie Vardhan
Lyrics & Vocal : Rajesh Jaladi & Sharon Philip
-----------------------------------------------------------------------