4393) బలవంతుని చేతిలో బాణములం గురివైపే చూస్తూ పరుగెడతాం


** TELUGU LYRICS **

బలవంతుని చేతిలో బాణములం
గురివైపే చూస్తూ పరుగెడతాం
మా గమ్యం చేరే వరకు ఆగదీపరుగు
మేము యేసుని వారసులం - రాజు యేసుని సైనికులం
మా గమ్యం చేరే వరకు ఆగదీపరుగు

అటు ఇటు తొలగక యేసుపై గురినిలుపుదాం
ఇచ్చిన ఆజ్ఞలు మరువక పాటించెదం
వాక్యమందు స్థిరపడుచు - ప్రార్ధనందు బలపడుచు
దేవుడిచ్చే సర్వాంగకవచం మేము కలిగుంటాం

పిలిచిన పిలుపుకు లోబడి మేము నడిచెదం
అలయక జడియక క్రీస్తునే ప్రకటించెదం
నిందలైన శ్రమలెదురైన - లోకాశలు వెంటాడుచున్న
వాడబారని మహిమ కిరీటం పొందుటే ధ్యేయం

దేవుని రాజ్యము నీతిని మేము వెతికెదం
శోధన బాధలో బెదరక పయనించెదం
వెనుకనున్నవి అన్నియు మరచి ముందు ఉన్న బహుమానముకై
పందెమందు ఓపికతోనే మేము పరుగెడతాం

------------------------------------------------------------------------------
CREDITS : Vocals : Joselyn, Jason, Jessica
Lyrics & Music : Bro.Gunaveer Paul & Prashant Rp
------------------------------------------------------------------------------