4353) ధరణిలో నీవు ఎవరు పరదేశులం మనము యాత్రికులము ధరణిలో


** TELUGU LYRICS **

ధరణిలో నీవు ఎవరు
పరదేశులం మనము యాత్రికులము ధరణిలో (2)
దేవుని పని చేయడమే మన భాగ్యము
దేవుని ధరి చేరడమే మన గమ్యము
ఓ..ఓ..ఓ పరదేశి
పరదేశులం మనము యాత్రికులం

సృష్టిలో ప్రతిదీ తన కొరకే బ్రతకకా ఆ
దైవాజ్ఞాను ఇలలో నేరవేర్చుచుండగా 
తన సృష్టికర్తను ఎరగని ఈ మనీషీ
తన కొరకు తానే బ్రతుకు చుండగా (2)
తన గమ్యము తనకే మరుగాయెను
తన నివాస స్థలమునే మరిచిపోయెను (2)
ఓ..ఓ..ఓ పరదేశి ఓ..ఓ..ఓ పరదేశి (2)

దేవ సృష్టిలో నీ పాత్రను ఎరిగి
దైవ సంకల్పమునే నేరవేర్చాలి
నీ గమ్యము నెరిగి ఆ దేవుని పనిలో
నీ తనువును ఇలలో ముగించుకొవాలి (2)
ఏ కష్టము ఏ నష్టము నీకు కలిగినా
నీ నిత్య వాసమును మరిచిపోకుము
పలు వ్యాధి బాధలు నిను ముట్టినా
పరమతండ్రి మార్గమును విడిచిపోకుము
ఓ..ఓ..ఓ పరదేశి ఓ..ఓ..ఓ పరదేశి (2)
పరదేశులం మనము యాత్రికులం

----------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Bro.Srinivas
Music : D.Shyam Prabhakaran
----------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments