4398) ఆశ్చర్యమే నాపై యేసయ్య కృప చూపుట ఏకోసన నాలో మంచేది లేకున్నను


** TELUGU LYRICS **

ఆశ్చర్యమే నాపై యేసయ్య కృప చూపుట
ఏకోసన నాలో మంచేది లేకున్నను (2)
దయచూపిన దైవపుత్రుడా 
నా ధన్యత నీ కృపయే కదా (2)
ఆనాటి నా గతము బహు ఘోరహీనము 
నాతోటి వారికి ఎగతాలినైతిని (2)
కరుణామయ నన్ను కరుణించుచు 
కనికరమే నాపై చూపావయ్య (2)
||ఆశ్చర్యమే||

పరిశుద్ధమైన నీ మాటకు నేనెంతో దూరమైతిని 
నాలోని క్రియలన్నియు బహు ఘోరపాపములే (2)
ఈ పాపికై భూవి దిగివచ్చిన
నా యేసు నాథా నా రక్షకా (2)
||ఆశ్చర్యమే||

నీ చేతిలో దీపమై నను ఉంచిన యేసయ్య
చీకటి బ్రతుకులను వెలిగించే జ్యోతిలా (2)
నను మర్చవయ్య ఇలా ఉంచావయ్య
నీ సాక్షిగా నన్ను నిలిపావయ్య (2)

--------------------------------------------------------
CREDITS : 
--------------------------------------------------------