4399) దయచూపినావు యేసయ్యా ఈ దీనురాలిపై నీవు కృప చూపితివి


** TELUGU LYRICS **

దయచూపినావు యేసయ్యా  
ఈ దీనురాలిపై నీవు కృప చూపితివి 
నీ చిత్తము నాలో నెరవేర్చము 
నీ కృపయే నాలో ఫలింపజేయుము

పలుకరించగా నాతోనే ఉంటివి 
దక్షిన హస్తముతో బలపరచినావు దేవా (2)
ఆయుష్కాలము నిన్ను స్తుతియించుచు 
పొగడెదను నా జీవితాంతము (2)
||దయచూపినావు||

నీ సన్నీదిలో నన్ను నిలుపుటకు 
నీ రక్షణను ఇచ్చినావు యేసయ్యా (2)
దర్శించితివి నా ప్రాణప్రియుడా 
ప్రణమిల్లెదను నీ కృపలోనే (2)
||దయచూపినావు||

మహిమను కనపరిచే మహనీయుడా 
మహకార్యములు చేయుచున్నవాడా (2)
అద్భుతములు జరిగించినావు 
నిలకడగా వివరింతునే (2)
||దయచూపినావు||

-------------------------------------------------------------------------
CREDITS : Written : Rev. Dr. Yesupadam Garu
Vocals & Music : Sis. Esther Rani & Ashok
-------------------------------------------------------------------------