4407) అంగరంగ వైభవంగా చేద్దామూరో ఆశ్చర్యకరుని పుట్టినరోజు

 

** TELUGU LYRICS **

అంగరంగ వైభవంగా చేద్దామూరో - ఆశ్చర్యకరుని పుట్టినరోజు 
సంతోష  సంబరముగా చేద్దామరో - శ్రీ యేసు నాధుని పుట్టినరోజు
ఇంటింటా చేద్దాము ఆనందముగా - ఊరంతా చేద్దాము సంతోషముగా
ఇంటింటా చేద్దాము ఉల్లాసముగా - జగమంతా చేద్దాము ఉత్సాహముగా

ధనవంతుడైన దేవాది దేవుడు - దీనుడై మన కొరకు వచ్చినాడురో 
అందరినీ ప్రేమించే అందరిని రక్షింప - అవనికి బాలుడై వచ్చినాడు
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ మేరీ క్రిస్మస్ 

బలవంతుడైన రాజాధిరాజు మన భారం మోయక వచ్చినాడురో 
చీకటిని తొలగించి వెలుగులో నడిపిం చే నిచ్చుడగు తండ్రి వచ్చినాడురో
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ మేరీ క్రిస్మస్

--------------------------------------------------------------------------
CREDITS : Lyrics : Rambabu Rk (Eleazar RK)
Vocals & Music : Joshua Gariki & Harish Antony
--------------------------------------------------------------------------