4406) పండుగ పండుగ క్రిస్మస్ పండుగ పండుగ పండుగ క్రీస్తుని చాటగా


** TELUGU LYRICS **

పండుగ పండుగ క్రిస్మస్ పండుగ - పండుగ పండుగ క్రీస్తుని చాటగా
పండుగ పండుగ ప్రజలకువెలుగుగా
చేద్దాం పండుగ గుండెల నిండుగా 
కలిసి చేద్దాం ఈ పండుగ తెలిసి చాటేద్దాం లోకం నిండుగా

పరలోకంలో జరిగిన పండుగ - దేవదూతలు జరిపిన పండుగ
గొర్రె కాపరులు తరింయిచినపండుగ - లోకజ్ఞానులు చేసిన పండుగ 
హృదయాలు కదిలించే పండుగ - హృదిలో నివసించే దేవుని పండుగ
కలిసి చేద్దాం ఈ పండుగా - పిలిచి పాడేద్దాం అవకాశం ఉండగా 

పాపము తొలగించిన పండుగ - శాపము తొలగించిన పండుగ 
పరిశుద్ధుడు దిగివచ్చిన పండుగ - ప్రభువైన యేసుని పండుగ 
మనసులు మారే పండుగ - మనుషులు మనసులు మారే పండుగ
కలిసి చేద్దాం ఈ పండుగ మైమరచి ఆడేద్దాం సందడిగా

గుండెగుడిలో జరగాలిఈపండుగ - ప్రతిహ్రుదిలో జరగాల్సిన పండుగ 
కొండ కోనల్లో చేరి ఉన్న పండుగ - దేశ దేశాల్లో జరుగుతున్న పండుగ
వధువుగా సిద్ధపడే పండుగ - లోక కళ్యాణం కొరకైన పండుగ 
కలిసి చేద్దాం ఈ పండుగ కలిసి చేయాలి మనమంతా దండిగ

-----------------------------------------------------------------
CREDITS : Music : Prasanth Penumaka
Lyrics, Tuning, Vocals : Pas. Rajendra Glm
-----------------------------------------------------------------