4434) అహా ఆహా ఎంతో ఆనందమే ఓహో ఓహో ఎంతో సంతోషమే

 

** TELUGU LYRICS **

అహా ఆహా ఎంతో ఆనందమే
ఓహో ఓహో ఎంతో సంతోషమే (2)
మహరాజు జన్మించాడులే
మహిమలెన్నో తెచ్చాడులే (2)
మనకింక సంబరాలే
తాకుతాయి అంబరాన్నె
మోగుతాయి సంగీతాలే (2)
||అహా ఆహా||

కన్యమరియయే గర్భమందునే
గొప్ప శ్రీమంతుడును కనెను 
సృష్టికర్తయే లోక రక్షకుడై
ఈ జగాన ఉదయించెను (2)
పాపులకే రక్షణ ఇచ్చెనే
పరమునకే మార్గం చూపెనే
రోగులకే స్వస్థత వచ్చెనే 
మృతులనే లేపబడెనే 
||మనకింక||

ఈ ధరణియే ప్రభుకి శరణయే
తరియించి పులకించెను
పరవసులమై క్రీస్తు జన్మము
కీర్తించి పాడెదము (2)
లోకానికి వార్త వచ్చెనే 
మానవాళికి శుభములు తెచ్చెనే
నింగి నేలకే పండగ వచ్చెనే
ప్రకృతియే కళకళలాడెనే 
||మనకింక||

-------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune: Padala Suresh Babu
Music & Vocals : Vinay Kumar & Surya Prakash
-------------------------------------------------------------------------