** TELUGU LYRICS **
ఆకాశంలో అద్భుతం జరిగేనంట
రారాజుని యేసుని జననం తార చూపెనట
పుడమే పులకించెనంట పశుల తొట్టి పానుపంట
ఆరే పల్లె పల్లెకు వెళ్ళి చాటి చెప్పుదామా సంతోష శుభవార్త
గొల్లలేమో దూతను చూచి భయపడుతూ వణికిపోగ
భయపడకుము శుభవార్త మీకు చెప్పెదనన్నదిగ
జ్ఞానులేమో ప్రభువుని చేరి బంగారు సాంబ్రాణిచ్చి
పూజించి నమస్కరించి సంతసించి వెళ్ళిరిగా
ఎంత గొప్ప భాగ్యమో ఇది సర్వ జనుల రక్షణ అంటూ
నశియించు వారికెల్ల నజరేయుని జననమే ఇల
సంతోష వార్త అంటూ గొంతు ఎత్తి పాడెదము
మన పాప భారమంత తాను మోయ సిద్ధపడుతూ
సమాధాన శాంతి మనకు అనుగ్రహించ వచ్చెనుగ
ప్రతి యింట రక్షణ వెలుగై ఉదయించే తేజోమయుడని

------------------------------------------------------------
CREDITS : Vocals: Vijay Kumar Kondru
Music : Dhinakaran Charles Kalyanapu
Lyrics & Tune : Surekha Konamanchali
------------------------------------------------------------