4454) రాజులకు రారాజు యేసు జనన మొందిన రోజు


** TELUGU LYRICS **

రాజులకు రారాజు యేసు జనన మొందిన రోజు (2)
హల్లెలుయా పల్లవులతో హల్లెలుయా స్తోత్రములతో 
వెల్లివిరిసిన గానం దూతగణముల గీతం (2)

రెండు వేల వత్సరాలుగా పరిమళించిన గానం 
మలినమైన హృదయ సీమను శుద్ధి చేసెడి భావం (2)
మరణకరమగు మనిషి బ్రతుకులో (2)
జీవకాంతుల శాంతి కిరణం
ఈ గానం హల్లెలుయా ఈ భావం హల్లెలుయా (2)
||రాజులకు||
 
దైవ ప్రేమ దీన రూపమై భువిలో వెలసిన వేళలో 
భావి జీవన దివ్య దీపమై కాంతు లీనుచు త్రోవలో (2)
పరమ పురమును చేరువరకును (2)
అరుణ శోభల కాంతి కిరణం 
ఈ గానం హల్లెలుయా ఈ భావం హల్లెలుయా (2)
||రాజులకు||

-------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Sis. Deepa Sudhakar Bandaru
Vocals & Music : Sis.Sharon Philip & Immi Johnson
-------------------------------------------------------------------------------------