** TELUGU LYRICS **
ఆద్యంతరహితుడవు అదృశ్యరూపుడవు (2)
ఏ చోట నిన్ను కనుగొందునూ
ఎలా నిన్ను దర్శింతును (2)
ఏ చోట నిన్ను కనుగొందునూ
ఎలా నిన్ను దర్శింతును (2)
నీలి గగనాన నేనెగిరినా
గొప్ప సంద్రాలపై సాగినా
కొండ శిఖరాలనే ఎక్కినా
లోయ లోతుల దిగి వచ్చినా (2)
గొప్ప సంద్రాలపై సాగినా
కొండ శిఖరాలనే ఎక్కినా
లోయ లోతుల దిగి వచ్చినా (2)
నది తీరాల నడయాడినా
జలరాసులనే ఈదిన
కారడవుల తిరుగాడినా
కొండ గుహలను తడువాడినా
మంచు ఖండాల పరికించినా
ఎడారులలో పయనించినా
ఈ ధృవమందు నే నిలిచినా
ఆ ధృవమందు నే పిలిచినా (2)
భూమి లోతుల శోధించినా
భూరేఖలపై వెదకినా
ఉదయ సంధ్యలు వీక్షించినా
ఊహలలో విహరించినా
ఒంటరినై నేనుండగా
నా గతమంత కదలాడగా
నా బ్రతుకంత కనిపించగా
కన్నీరే ప్రవహించగా (2)
దీన మనస్సున ప్రార్థించగా
నీదు వాక్యము చెబూనగా
నీ కృప నన్ను కరుణించగా
నీ మహిమే నను తాకగా
నా గుండె గుడిలోన కనుగొంటిని
నీ వెలుగు నేనే దర్శించితి
** ENGLISH LYRICS **
Aadhyantharahithudavu
Adhrushyaroopudavu
Ae Chota Ninnu Kanugondhunu
Ela Ninnu Dharshinthunu
Neeli Gaganaana Nenegirina
Goppa Sandhraalapai Saagina
Konda Shikharaala Ne Ekkina
Loyalothula Dhigi Vacchina
Nadhi Theeraala Nadayaadina
Jalaraasula Ne Eedhina
Kaaradavula Thirugaadina
Konda Guhalanu
Thaduvaadina
Edaarulalo Payaninchina
Ee Dhruvamandhu Ne Nilichina
Aa Dhruvamandhu Ne Pilichina
Bhoomi Lothula Shodhinchina
Bhoorekhalapai Vedhakina
Udhaya Sandhyalu Veekshinchina
Oohalalo Viharinchina
Ontarinai Nenundaga
Naa Gathamantha Kadhalaadaga
Naa Brathukantha Kanipinchaga
Kanneere Pravahinchaga
Dheena Manassuna Prardhinchaga
Needhu Vaakyamu Chebunaga
Nee Krupa Nannu Karuninchaga
Nee Mahime Nanu Thaakaga
Naa Gunde Gudilona Kanugontini
Nee Velugu Nene Dharshinchithi
-------------------------------------------------------------------------
CREDITS : Music : Joshi Madasu
Lyrics : Nathanael (Venkateswara Rao Puvvula)
Tune & vocals : Pastor. Samuel Paul Rowthu
-------------------------------------------------------------------------