** TELUGU LYRICS **
ఆ తళుకు తారక తెలిపింది తేటగా సందేశం ఇవ్వగా రారమ్మని
కదిలింది జ్ఞానం కొలిచింది దూరం నడిచింది నజరానా నజరేడుగా
ఆ అంబరాన ఆ దివ్య తేజం దూతలతో చేరి నిలిచింది గా
ఈ గొర్రెపిల్ల పలికింది మేటిగా యజమాని మాటే తనబాటని
కన్య గర్భాన పుట్టాడని
ఆ పరమును మనకు తెచ్చాడని
దేవుడే రాసి ఉంచాడని
ఒక పురములో నేడు ఉన్నాడని
పండగ చేద్దాం రారండని
కదిలింది జ్ఞానం కొలిచింది దూరం నడిచింది నజరానా నజరేడుగా
ఆ అంబరాన ఆ దివ్య తేజం దూతలతో చేరి నిలిచింది గా
ఈ గొర్రెపిల్ల పలికింది మేటిగా యజమాని మాటే తనబాటని
కన్య గర్భాన పుట్టాడని
ఆ పరమును మనకు తెచ్చాడని
దేవుడే రాసి ఉంచాడని
ఒక పురములో నేడు ఉన్నాడని
పండగ చేద్దాం రారండని
ఏమో ఏమో పేరు అది బెత్లహేము ఊరు
ఆ ఇమ్మానుయేలు మన తోడైయున్న యేసు
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్
||ఆ తళుకు||
పరిశుద్ధుడు ప్రభువు ఈ బాల యేసు
అద్భుతాలు ఎన్నో అవలీలగా చేసి (2)
భారమును తన భుజముపై మోసి
అపవాదిని తొక్కి అందాన్ని తీసి
మన రక్షకుడు యేసు పుట్టాడుగా
||ఏమో|| ||ఆ తళుకు||
నింగి పొంగింది ఈ నేల మురిసింది
పుడమి పిలచింది ఏసయ్యని (2)
నీ నా హృదయంలో జ్యోతిని వెలిగించి
శ్రీ యేసుని చూడ సంతోషమే
ఊరంతా పండుగ చేద్దాములే
నింగి పొంగింది ఈ నేల మురిసింది
పుడమి పిలచింది ఏసయ్యని (2)
నీ నా హృదయంలో జ్యోతిని వెలిగించి
శ్రీ యేసుని చూడ సంతోషమే
ఊరంతా పండుగ చేద్దాములే
||ఏమో|| ||ఆ తళుకు||
ఆజ్ఞలను మీరి ఆపదలో దూరి
పాపమును కోరి శాపమును చేరి (2)
క్షమాయే కనలేని కారడివిలోన
మనలను ప్రేమించి పరలోకమిచ్చే
మన రక్షకుడు యేసు పుట్టాడుగా
||ఏమో|| ||ఆ తళుకు||
సర్వ అధికారి ఆ సిల్వలో చేరి
నేరమే లేని ఆ శిక్ష భరించి
విశ్వాసము లేని మనలను బ్రతికించి
బలి అయిపోయాడు బలవంతుడు
స్తోత్రము స్తోత్రము పాడరే
నేరమే లేని ఆ శిక్ష భరించి
విశ్వాసము లేని మనలను బ్రతికించి
బలి అయిపోయాడు బలవంతుడు
స్తోత్రము స్తోత్రము పాడరే
||ఏమో|| ||ఆ తళుకు||
లోకరక్షకుని మనమంతా కూడి
శుభవార్తను తెలుప స్తోత్రములు పాడి
సంగీతముతోను నాట్యముతో వేడి
ఆలయము చేరి ఆనందమోడి
హల్లెలూయ అని పాడరే
ఏమో ఏమో పేరు అది బెత్లహేము ఊరు
ఆ ఇమ్మానుయేలు మన తోడైయున్న యేసు
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
శుభవార్తను తెలుప స్తోత్రములు పాడి
సంగీతముతోను నాట్యముతో వేడి
ఆలయము చేరి ఆనందమోడి
హల్లెలూయ అని పాడరే
ఏమో ఏమో పేరు అది బెత్లహేము ఊరు
ఆ ఇమ్మానుయేలు మన తోడైయున్న యేసు
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
------------------------------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune & Music : Sneha Potala & Issac
Vocals : Keerthana, Tulasi, Kiran, Chanti, Stella, Sanjay, Pas. Srinivasa Rao
------------------------------------------------------------------------------------------------------------------