4335) ప్రతీ క్షణం నీతో ఉండాలని నే ఆశతో ఉన్నాను నా యేసయ్య


** TELUGU LYRICS **

ప్రతీ క్షణం నీతో ఉండాలని
నే ఆశతో ఉన్నాను నా యేసయ్య 
నా జయము నీ ఆత్మతో శాశ్వతమని నే బ్రతుకుచున్నానయ

నిన్ను విడువనని ఎడబాయను అని అన్నావు
నాకు నిత్యము నీవు తోడై నడిపించు చున్నావు
నమ్మాను... విశ్వసించాను యేసు నీవే నా మార్గము నమ్మాను...
విశ్వసించాను యేసు నీవే నా జీవము

నీ బాహువు ముఖకాంతియే అన్నిటిలో జయమిచ్చేను
మమ్ము కటాక్షించు రారాజువు నీవేనయ్యా
నమ్మాను... విశ్వసించాను యేసు నీవే నాఅతిశయం
నమ్మాను... విశ్వసించాను యేసు నీవే నా పరవశం

నీ ఉపదేశమే ఎల్లపుడు బ్రతికించుచున్నది
నా ప్రాణాత్మకు అవి మనుగడై యున్నవి
నమ్మాను... విశ్వసించాను యేసు నీవే నా సర్వము 
నమ్మాను... విశ్వసించాను యేసు నీవే సమస్తము

-------------------------------------------------------------------------------
CREDITS : Lyrics,Tune : Bro. Srinivas
Vocals & Music : Bro. Nissy John garu & Jonah Joe
-------------------------------------------------------------------------------