** TELUGU LYRICS **
దేశమా దేశమా సిగ్గుపడు దేశమా
దేశమా దేశమా జాలిపడు దేశమా (2)
దేశమా దేశమా జాలిపడు దేశమా (2)
ఆడబిడ్డ నగ్నంగా నడివీదిన ఊరేగుతోంది
చచ్చిపడి కామాంధుల కోరికలకు బలవుతోంది
నీటిబుగ్గ పగిలినట్టు గర్భసంచి పగులుతోంది
మత ఉన్మాద కోర కొరికికొరికీ చంపేస్తోంది
నెత్తురోడుతోంది దేశం నెత్తురోడుతోంది
రక్తమోడి రక్తమోడి అడుగు తడబడుతోంది
స్వార్థమను సుత్తెలుమోది దేశం తలపగిలింది
మారణ హోమాలతో ఛిద్రం చేసేస్తోంది.
||దేశమా దేశమా||
తెల్లోడి బానిసగా బ్రతికిన కథ ముగిసింది
నల్లోడి పాలనలో మళ్ళీ ఉరి బిగిసింది
స్వతంత్ర దినోత్సవం పండగలా మారింది
కాలే కడుపులకు స్వేచ్ఛ అనేది ఎక్కడుంది?
దేశమంటే మట్టికాదు మనుషులంటూ నేర్పారు
మట్టికే ఆశపడి మనుషుల్ని చంపుతున్నారు
భారతీయులందరం అన్నదమ్ములన్నారు
కుల మత వివక్షలతో మళ్ళీ చిచ్చు రేపారు
పశువుకున్న విలువైన పడుచులకు లేదాయే
చావు మేళాలతోనే కొత్తరోజు మొదళాయే
మూత్రాభిషేకాలతో మన గుండెలు తడిసాయే
పేదల శవ యాత్రలో అభివృద్ధిని వేధికాయే.
దేశమా దేశమా దుఃఖపడు దేశమా
దేశమా దేశమా బాగుపడు దేశమా
దైవమా దైవమా మమ్ము కాపాడుమా
దైవమా దైవమా దేశాన్ని కాయుమా
---------------------------------------
CREDITS : Vijaya Prasad
---------------------------------------