4336) ఎంత మంచి దేవుడవు నా యేసు ప్రభువా నీ మంచినంతటిని

 ** TELUGU LYRICS **

ఎంత మంచి దేవుడవు నా యేసు ప్రభువా 
నీ మంచినంతటిని నాపైన చూపావా (2)
రాజా నీ బలమును బట్టి సంతసించుచున్నాను
నీ రక్షణను బట్టి హర్షించుచున్నాను (2)
ఆధారము నీవే యేసయ్యా నా ఆనందము నీవే యేసయ్యా
ఆధారము నీవే యేసయ్యా నా ఆనందము నీవే యేసయ్యా
||ఎంత మంచి దేవుడవు||

శ్రేయస్కరమైన ఆశీర్వాదమిచ్చావు
అపరంజికిరీటముతో అలంకరించావు (2)
దీర్ఘాయువుతో గొప్ప మహిమతో 
నన్ను నింపావు నా యేసయ్య (2)
||ఆధారము||

నా కోరికలను సఫలము చేసావు 
నా ప్రార్థనలను అంగీకరించావు (2)
నీ కృప చేత నీ సన్నిధిని
ఉల్లసింప చేశావు నా యేసయ్య (2)
||ఆధారము||

-------------------------------------------------------------------------------------------
CREDITS : Tune, Vocals : Pas B. Prasad Garu
Lyrics & MUsic : Srisha Prasad Garu & Prasanth Penumaka
-------------------------------------------------------------------------------------------