4338) నీ కృప నన్ను జీవింపజేసెను నీ కృప నాకు ఆధారము


** TELUGU LYRICS **

నీ కృప నన్ను జీవింపజేసెను 
నీ కృప నాకు ఆధారము (2)
నీ కృపయే కదా నను బ్రతికించెను 
నీ కృపయే కదా నను బలపరిచెను 
నీ కృపయే కదా నను విడిపించెను 
నీ కృపయే కదా విజయమిచ్చెను 
నీ కృప నన్ను జీవింపజేసెను 
నీ కృప నాకు ఆధారము (2)

విషవలయముల ఉరులను పన్నిన 
అపవాదిని ఎదిరించినది 
విసుగక విడువక ఎడబాయని కృప 
నన్నిల నిలిపి నడిపినది (2)

నీ కృపయే కదా ఆశ్రయదుర్గము 
నీ కృపయే కదా అనితరసాధ్యము 
నీ కృపయేకదా ఆయుష్కాలము 
నీ కృపయే కదా ఈ అభిషేకము
నీ కృప నన్ను జీవింపజేసెను 
నీ కృప నాకు ఆధారము (2)

కఠినుల నడుమ వికటములైన 
కపటపు ప్రేమను తొలగించి 
కరుణతో బ్రోచి కౌగిట దాచి 
నా కన్నీటిని తుడచినది (2)

నీ కృపయే కదా ఔషధమాయెను 
నీ కృపయే కదా గాయము కట్టెను 
నీ కృపయే కదా గమనము మార్చెను 
నీ కృపయే కదా గమ్యము చేర్చును
నీ కృప నన్ను జీవింపజేసెను 
నీ కృప నాకు ఆధారము (2)

-----------------------------------------------------------
CREDITS : Bro Aronkumar Nakrekanti
-----------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments