4325) మహిమోన్నతుడా మహోపకారుడా మరణాన్ని గెలిచినవాడ మహా దేవుడా


** TELUGU LYRICS **

మహిమోన్నతుడా మహోపకారుడా
మరణాన్ని గెలిచినవాడ మహా దేవుడా 
ఆశ్చర్యకారుడా ఆల్ఫా ఒమేగా 
అద్భుతాలు చేయువాడా ఆది అంతం అయ్యుంనవాడా 
ఈ సృష్టి అంత నీ మహిమతో నిండి యున్నది
సర్వ జీవరాసులు నీ మాటకు లోబడుచున్నవి
ఎన్ని తరాలు మారిన నీ మాట మారదు 
ఎన్ని యుగాలు గడిచిన నీ వాగ్దానం మారిపోదు 
యోగ్యుడా... యోగ్యుడా...
స్తుతులపై ఆసీనుడా 
ఆరాధ్యుడా తేజోమయుడా
ఆరాధనకు అర్హుడా (2)

వేవేల దూతలతో కొనియాడబడుచున్న 
సుందరుడా
ఆకాశమునే సింహాసనముగా 
ఆసీనుడవైన బలశూరుడా (2)
ఎలుగెత్తి  నీ కొరకే నే పాడెద 
స్తుతి కీర్తన
నీ కృప వల్లనే నాకు జీవమని
చాటిచెప్పేదా అనునిత్యము 
యోగ్యుడా... యోగ్యుడా...
స్తుతులపై ఆసీనుడా 
ఆరాధ్యుడ తేజోమయుడా
ఆరాధనకు అర్హుడా (2)

మంటినయ్య నా తలెనెతుట్టకు  
బయపడచున్నాను పరిశుద్దుడా
ఏ యోగ్యత లేని అల్పుడనైనా 
నాలాంటి వాని కొరకు బలీయవైనావు (2)
నీ శిలువే శరణం అని ప్రకటించెద సువార్తను
నీ బాటే మోక్షమని నే సాగేద నీ సాక్షిగా
యోగ్యుడా... యోగ్యుడా...
స్తుతులపై ఆసీనుడా 
ఆరాధ్యుడ తేజోమయుడా
ఆరాధనకు అర్హుడా (2)

----------------------------------------------------------------------------------------------------
CREDITS : Written, Tuned and Composed by : R. Daniel Praveen 
Vocals : Pastor Sushanth Karem and R. Daniel Praveen 
----------------------------------------------------------------------------------------------------