** TELUGU LYRICS **
స్తుతి గీతముల్ పాడెదను
సువార్తను చాటెదను
త్వరలో రానై యున్న యేసయ్యను
ఆర్భాటించి ప్రకటింతును
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
||స్తుతి||
సువార్తను చాటెదను
త్వరలో రానై యున్న యేసయ్యను
ఆర్భాటించి ప్రకటింతును
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
||స్తుతి||
పరలోకము నుండి మన ప్రభువు
ఆర్భాటముతో దిగి వచ్చును
ప్రధాన దూత శబ్దముతో
దేవుని బూరతో వెడలి వచ్చును
||హల్లెలూయ|| ||స్తుతి||
ప్రభు నందు మృతులు మొదట లేతురు
పరిశుద్దులాయనను అనుసరింతురు
నేడే రక్షణ దినము తెలుసుకో
ఆలస్యం చేయక ప్రభువుని చేరుము
||హల్లెలూయ|| ||స్తుతి||
కాలము సమీపించి యున్నది
ఓ క్రైస్తవా మేలుకొనుమా
నరకాగ్నికి నువ్వు ద్వారము తెరువక
పరలోకపు గవిని తేరి చూడుము
||హల్లెలూయ|| ||స్తుతి||
-----------------------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Vocals : Bro.Suresh Babu garu, Bro.Rejumon garu
Music : Bro.Sampath
-----------------------------------------------------------------------------------------------------------