4301) ప్రేమామృతం నాపై కురిపించినావు ప్రేమ స్వరూపుడ నా యేసయ్య


** TELUGU LYRICS **

ప్రేమామృతం నాపై కురిపించినావు
ప్రేమ స్వరూపుడ నా యేసయ్య (2)
యేసయ్య యేసయ్య
నీ పాదాలకే పుష్పాంజలి

నా పాపపు బ్రతుకును కడుగుట కొరకు
నీ రక్త ధారలే ధరలో ప్రవహించెనే (2)
నిన్ను స్తుతించకుండా ఉండలేనయ్యా
నను కోరుకున్నావు అమర ప్రేమికుడా (2)

లోకము వైపు నా కనులు మరల్చక
నీ క్రమశిక్షణలో నన్ను విరచిన దేవా (2)
ఫలియింతునయ్యా నీ ద్రాక్షావనములో
ప్రేమధారలొలికే మెల్లని స్వరముతో (2)

శాశ్వత రాజ్యములో నాకై నీవు
దాచి ఉంచిన మేలులు ఘననీయమే (2)
ఘనమైన నీ కీర్తి చాటించుటకు
ఈ శేష జీవితమే నీకు చిరు కానుక (2)

-------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Music :  Pas.Adam garu, Joshua gotikala 
Vocals : Zephaniah 
-------------------------------------------------------------------------------------------