4300) చాలునయ్యా యేసయ్య నీ కృప నాకు చాలునయ్యా


** TELUGU LYRICS **

చాలునయ్యా యేసయ్య - నీ కృప నాకు చాలునయ్యా 
చాలును చాలును నీ కృప నాకు చాలునయ్యా
నీ కృపనాకు చాలునయ్యా 

పాపపు లోకమే నిశీధి రాత్రిలో
పీడకలలా ననువేధించెనే         
వ్యధచెందు నా మదిలో మ్రోగెను నాదమై 
కృపా సాగరా నీ శుభ సందేశమే 
||చాలును||

నిరాశ నిష్పృహలే నిప్పుల గుండమై 
నా కంటికి నిదుర కరువాయే స్వామి 
కొలిమిని బరియించే బంగారమునేనై 
ప్రజ్వరిల్లేదా ప్రభువా నీ ప్రతిరూపముగా
||చాలును||

ఏయోగ్యతలేని నాకొరకై నీవు
కృపగల రాజ్యమును స్థాపించినావు 
ఆ నిత్య మహిమలో వేవేదూతలతో
స్తుతి నైవేద్యమును నీకై అర్పింతును 
||చాలును||

-----------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Music : Pas.Adam garu, Joshua gotikala 
Vocals : Boppuri Peterson 
-----------------------------------------------------------------------------------------