4316) నీ కృపాలో నన్ను దాచావు యేసయ్యా యేసయ్యా

** TELUGU LYRICS **

నీ కృపాలో నన్ను దాచావు యేసయ్యా యేసయ్యా
నేను బ్రతికి ఉన్నానంటే నీ దయా నీ దయా (2)
నీ జీవమే నాలో ఉండగా నాకు భయమే లేదయా 
నా తండ్రిగా నీవు ఉండగా  నాకు కొరత లేదయ్య 
నీ తోడు నాకు ఉంటే చాలయ్యా చాలయ్యా
యేదైనా సాధ్యమే నీతో యేసయ్యా యేసయ్యా
||నీ కృపాలో||

ఏ త్రోవలో లేకున్నా నిరాశలో ఉన్న 
నీ జీవ వాక్యాముతో నను నడుపుము యేసన్నా (2)
దయచూపుమా దీవించుమా 
సమృద్ధి జీవముతో తృప్తిపరచుమా (2) 
నీ తోడు నాకు ఉంటే చాలయ్యా చాలయ్యా
యేదైనా సాధ్యమే నీతో యేసయ్యా యేసయ్యా
||నీ కృపాలో||

పేరు ప్రఖ్యాతలు ఉన్న సంపదలు ఉన్న 
నీ కృప లేకపోతే అన్నియు వ్యర్ధమే (2)
నీ కనికరం నీ కరుణా 
నా జీవితానికి చాలు యేసయ్యా (2)
నీ తోడు నాకు ఉంటే చాలయ్యా చాలయ్యా
యేదైనా సాధ్యమే నీతో యేసయ్యా యేసయ్యా
||నీ కృపాలో||

కరురెప్ప పాటైన నను విడువని యేసయ్యా
నీ సేవ చేయుటకే నే జీవిస్తానయ్యా (2)
నీ ప్రార్ధన అలకించుమా 
పరిపూర్ణమైన వారిగా అభిషేకించుమా (2)
నీ తోడు నాకు ఉంటే చాలయ్యా చాలయ్యా
యేదైనా సాధ్యమే నీతో యేసయ్యా యేసయ్యా
||నీ కృపాలో||

-------------------------------------------------------------------------------------
CREDITS : Sharon Sisters, Philip Gariki & Sharon Philip
Music : JK Christopher
-------------------------------------------------------------------------------------