** TELUGU LYRICS **
అదిగో ప్రియుని కేక నీకై యేసు రాక (2)
వెదుకుతు ఉన్నావా
విడుదల దారే కనరాక
పొందే ఈ శ్రమలు
నీతో ఉండవు కడదాక (2)
||అదిగో||
వెదుకుతు ఉన్నావా
విడుదల దారే కనరాక
పొందే ఈ శ్రమలు
నీతో ఉండవు కడదాక (2)
||అదిగో||
అడుగడుగున పయనములో అవమానపు హేళనలో
నొప్పించే మాటలతో
మనసు నలిగి ఉన్నావా (2)
మదినిండిన వేదనను
మౌనముగా భరియిస్తూ
కనుల నిండ కన్నీళ్ళతో
ప్రభుని చూస్తు ఉన్నావా
నువ్వు నమ్మినా దేవుడు
నిన్ను మరచి పోడెన్నడు
అనుభవాల పాఠం కోసం
నిన్ను అప్పగించాడు
పొందే ప్రతి గాయం రూపుమాసిపోయే
సమయం సంతోషం ఇక ఆసన్నమాయే (2)
||వెదుకుతు ఉన్నావా||
ప్రాణహితులు అన్నవారే
ప్రాకారము కూల్చివేయగా
అనురాగం చిన్నబోయి
మిన్నకుండిపోయావా (2)
నీ ప్రేమే విషమయ్యి
నీ మమతే మిష అయ్యి
నువ్వు ఆనుకున్న వారే
నిన్ను త్రోసివేసారా
నీవు చేసినా మేలు
నీ దేవుడు చూసాడు
నీవు పొందినా కీడు
నిశ్చయముగ రాశాడు
న్యాయం అన్యాయం తెలిసి ఉన్నవాడు
నీ నీతే సూర్యకాంతై వెలుగ నిలుపుతాడు (2)
||వెదుకుతు ఉన్నావా||
-------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------