4308) నలిగిన నా బ్రతుకులో ఎన్నో శోధనలు


** TELUGU LYRICS **

నలిగిన నా బ్రతుకులో - ఎన్నో శోధనలు
ఇరుకులు ఇబ్బందులు - నను కృంగజేయునప్పుడు
పాపపు శాపము - నను వెంటాడినపుడు
శత్రువు ఉచ్చుకు - నేను బంధినైనప్పుడు
దేవా నీవే సహాయము చేయువడవు నాకు
దేవా నీవు తప్ప ఎవరు నాకు ఈ లోకములో (2)

వేదన బాధతో నే ఒంటరైనప్పుడు
బ్రతుకు మీద ఆశలే నే కోల్పోయినప్పుడు
ఓదార్పు కరువై నే ఏడ్చినప్పుడు
శత్రువే నను చూసి నవ్వినప్పుడు 
దేవా నీవే సహాయము చేయువడవు నాకు
దేవా నీవు తప్ప ఎవరు నాకు ఈ లోకములో

ఎవరున్నారు దేవా
ఎవరున్నారు నాకు నీవు తప్ప ఈ లోకములో 
ఎవరున్నారు (2) 

దేవా నీవే సహాయము చేయువడవు నాకు
దేవా నీవు తప్ప ఎవరు నాకు ఈ లోకములో
దేవా నీవే సమాధానము కలుగజేయువాడవు
దేవా నీవు తప్ప ఎవరూ నాకు ఈ లోకములో
దేవా నీవే ఆరోగ్యము నిచ్చువాడవు నాకు
దేవా నీవు తప్ప ఎవరు నాకు ఈ లోకములో
దేవా నీవే ఆశీర్వాదము కలుగజేయువాడవు
దేవా నీవు తప్ప ఎవరు నాకు ఈ లోకములో

-------------------------------------------------------------------------------------
CREDITS : Song Lyrics,Tune & Music: Asha Ashirwadh
DOP&Edit: Manikanth
-------------------------------------------------------------------------------------